తెలంగాణ‌లో మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు

ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాలలో శుక్ర‌వారం ఉదయం 05.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. ఉదయం 08.30 గంటలకు ఉత్తర అండమాన్ సముద్రం మరియు దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం  ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నది. దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపొస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాగల 24 గంటలలో ఇది మధ్య బంగాళాఖాతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. తదుపరి ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో అక్టోబరు 12వ తేదీ ఉదయం వాయుగుండముగా తీరాన్ని దాటే అవకాశం ఉంది ఈరోజు చాలాచోట్ల  మరియు రేపు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది ఈరోజు, రేపు ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.